మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి


Fri,September 7, 2018 02:22 AM

కొత్తగూడ, సెప్టెంబర్ 06: ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఏటీడీవో మంగ్యానాయక్ అన్నారు. కొత్తగూడ మండల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, వసతి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, వసతి గృహ, బాలికల పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో గురువాం హరితహారంపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏటీడీవో ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి హరితహారంపై ప్రతిజ్ఞ చేశారు. ప్రధానోపాధ్యాయులు రాజమ్మ, ఈసం సురేందర్, రమణ, పాపయ్య, భాగ్యమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...