కుల వృత్తులకు కేసీఆర్ హయాంలోనే సముచిత స్థానం..


Thu,September 6, 2018 01:42 AM

-పద్మశాలి సంఘం కమ్యునిటీ హాల్ శంకుస్థాపనలో
-ఎమ్మెల్యే కోరం కనకయ్య
బయ్యారం, సెప్టెంబర్ 05 : కులవృత్తులకు అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో మార్కండేయ పద్మశాలి సంఘం నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కావడంతో కుల వృత్తులను నమ్ముకొని జీవించిన కుటుంబాలు రోడ్డున పడేవని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో కుల వృత్తులకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. యాదవులకు కోసం గొర్రెలు పంపీణీ చేశారని, పద్మశాలీలు ఐకమత్యంతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కమ్యూనిటీ భవనం కోసం రూ. ఐదు లక్షల రుపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, ఏఎంసీ చెర్మన్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ గోపాల్, మంగీలాల్, టీఆర్‌ఎస్ నాయకులు రెంటాల బుచ్చిరెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రటరీ యాదగిరి, నారాయణ, మండల అధ్యక్షుడు శివానందం, వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షుడు చందా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...