కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేద్దాం

Thu,September 6, 2018 01:42 AM

నెల్లికుదురు, సెప్టెంబర్05 : మారుమూల ప్రతీ గిరిజన తండాకు రవాణా సౌకర్యం కల్పిస్తానని తాను మాటిచ్చానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలందరు దీవించి మళ్లీ సీఎంను చేసి రుణం తీర్చుకోవాలని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని కాచికల్ ఆర్‌డబ్ల్యూఎస్ రోడ్డు నుంచి తిమ్మతండా మీదుగా రత్తిరాంతండా వరకు రూ.2కోట్లు, బ్రాహ్మణకొత్తపల్లి నుంచి శ్రీహరితండా వరకు రూ.2కోట్లు, వావిలాల ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి కేజీ తండా, బోటిమీదితండా, సూర్యతండా మీదుగా శ్రీరాజ్య తండా వరకు రూ.3కోట్లు, ఆలేరు ఆర్‌డబ్ల్యూఎస్ రోడ్డు నుంచి హేమ్లాతండా మీదుగా ఇస్రాతండా వరకు రూ.1.45కోట్లు, బంజర స్టేజీ నుంచి లక్ష్మీపురం మీదుగా చిన్నముప్పారం వరకు రూ.2కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాలకు బుధవారం టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 60 ఏళ్లు పాలించిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏంటని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అరవయేళ్లలో సాధించలేని అభివృద్ధిని కేసీఆర్ కేవలం నాలుగున్నర ఏళ్లలో సాధించి పెట్టారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి రాష్ర్టాలన్నీ హర్షిస్తున్నారని తెలిపారు. కాగా మండలంలోని కాచికల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీనాయక్, ఎంపీపీ ఎల్తూరి వెంకటమ్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గుగులోత్ బిక్కునాయక్, యాసం రమేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరుపాటి వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మీడియా ఇన్‌చార్జి కసరబోయిన విజయ్‌యాదవ్, నాయకులు గుగుల మల్లయ్య, బీరవెళ్లి యాదగిరిరెడ్డి, దాసరి ప్రకాశ్, మునిగంటి కుమార్, కిషన్‌రావు, మురళి, ఘనపురం సోమయ్య, ఎర్రబెల్లి మాధవి, కాలేరు శ్రీనివాస్, సతీశ్, షరీఫ్, దర్శనం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles