మామిడి తోరణం..!


Fri,February 17, 2017 01:07 AM

-హరితహారంలో మామిడి మొక్కలకు ప్రాధాన్యం
-10 లక్షలు నాటేందుకు అధికారుల నిర్ణయం
-స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు కసరత్తు
-అనువైన 40 ఎకరాల స్థలం కోసం అన్వేషణ..
-మూడు ప్రాంతాల పరిశీలన..
-త్వరలో ఖరారు, పనులు ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా దానిని విజయవంతం చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం 1.20 కోట్ల మొక్కలను నాటేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పండ్ల చెట్లు, రోడ్ల పక్కన తదితర ప్రాంతాల్లో నీడనిచ్చే మొక్కలను పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 10 లక్షల మామిడి మొక్కలను నాటేందుకు నిర్ణయించిన అధికారులు వాటిని స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

నర్సరీలో అంటు కట్టేందుకు అనువైన 40 ఎకరాల స్థలం కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాలను పరిశీలించిన జేసీ వీటిలో మహబూబాబాద్ మండలం జంగిలిగొండ స్థలాన్ని ఖరారు చేసేందుకు సమాయ త్తమయ్యారు. త్వరలో దీనిని ఫైనల్ చేసి బోర్లు, బావులు తవ్వించి మామిడి మొక్కల పెంపకాన్ని చేపట్టే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల్లో అవగాహన కల్పించి మామిడి తోటల పెంపకాన్ని సైతం ప్రోత్సహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని అన్ని శాఖలు కలిసి విజయవంతం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో భారీ ఎత్తున మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధం గా నీడనిచ్చే, పండ్ల మొక్కలను అధికంగా పెంచేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పండ్ల మొక్కలు, రోడ్లు తదితర ప్రాంతాల్లో నీడనిచ్చే మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ఈ నేపథ్యంలో మొక్కల పెంపకాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీ సుకుంటున్నారు. అటవీ, గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉద్యాన తదితర శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ నుంచి జిల్లా వ్యాప్తంగా 1.20 కోట్ల మొక్కలను నాటేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున మామిడి మొక్కలను నర్సరీల్లో ఉత్పత్తి చేసేందుకు అనువైన స్థలాలను అధికారులు అన్వేషిస్తున్నారు.

జిల్లాలో మామిడి అంట్ల పెంపకం..


జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మామిడి అంట్ల పెంపకాన్ని చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా సంయుక్త కలెక్టర్ దామోదర్‌రెడ్డి, ఉద్యానవన శాఖాధికారి సూర్యనారాయణతోపాటు రెవె న్యూ అధికారులు గత కొన్ని రోజులుగా అనువైన స్థలం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటికే కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ మండలం జంగిలిగొండలో ప్రభు త్వ, అసైన్డ్ భూములను పరిశీలిస్తున్నారు.

40 ఎకరాల కోసం..


గతంలో మామిడి మొక్కలను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అలా కాకుండా జిల్లాలోనే వాటిని ఉత్ప త్తి చేయాలని సంకల్పించిన అధికారులు ఉద్యానవన శాఖ ఆ ధ్వర్యంలో నర్సరీలో మామిడి అంట్లను పెంచేందుకు అనువైన 40 ఎకరాల స్థలం కోసం వెతుకుతున్నారు. దీనిని గుర్తించిన వెంటనే గ్రౌండ్ వాటర్ అధికారులు పరిశీలించి నీటి లభ్యతను నిర్ధారించిన అనంతరం అందులో బోర్లు, బావులను తవ్వించడం లాంటి కార్యక్రమాలను పూర్తిచేయనున్నారు. ఆ తరువా త మామిడి అంట్ల పెంపకాన్ని చేపట్టనున్నారు.

టార్గెట్ 1.20 కోట్లు


వచ్చే వానా కాలంలో 1.20 కోట్ల మొక్కలను పెంచేందుకు అధికారులు అంచనా వేశారు. అటవీ భూములు, ప్రభుత్వ స్థ లాల్లో వీటిని నాటేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే స్థలాలను గుర్తించిన అధికారులు ఒక కోటి నీడనిచ్చే, 20 లక్షల పండ్లనిచ్చే మొక్కలను పెంచేందుకు రం గం సిద్ధం చేస్తున్నారు. 20 లక్షల మొక్కల్లో కనీసం 10 లక్షల మామిడి మొక్కలను పెంచేందుకు కృషి చేస్తున్న జిల్లా యం త్రాంగం నాలుగైదు రోజుల్లో స్థలాన్ని ఫైనల్ చేయనుంది.

మూడు చోట్ల స్థలాల పరిశీలన


మామిడి మొక్కలను పెంచేందుకు జిల్లాలో మూడు చోట్ల స్థలాలను అధికారులు పరిశీలించారు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ మండలం జంగిలిగొండ, మ హబూబాబాద్ నుంచి నర్సంపేట రోడ్డుకు వెళ్లే దారి మధ్యలో మొత్తం మూడు చోట్ల స్థలాలను గుర్తించారు.

ఇందులో తాజా గా గురువారం మహబూబాబాద్ మండలం జంగిలిగొండలో జేసీ దామోదర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయ ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు కలిసి స్థలా న్ని పరిశీలించారు. ఈ మూడింటిలో జంగిలిగొండ స్థలం అనువుగా ఉందని గుర్తించిన అధికారులు దానిని ఖరారుచేసే పని లో నిమగ్నమయ్యారు. గ్రౌండ్‌వాటర్ అధికారులు సైతం ఈ స్థలం బాగుందని సూచన ప్రాయంగా ధ్రువీకరించారు.

రైతులకు మేలు..


ప్రస్తుతం గుర్తించే 40 ఎకరాల్లో హరితహారానికి అవసరమైన మామిడి మొక్కలను నిరంతరంగా పెంచనున్నారు. అం తేకాకుండా ఉద్యానవన శాఖ ద్వారా రైతులను ప్రోత్సహించి జిల్లా వ్యాప్తంగా మామిడితోటల పెంపకాన్ని చేపట్టనున్నారు. ఆసక్తి గల రైతులకు వీటిని అందించనున్నారు. జిల్లాలో మామి డి అంట్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహించే హరితహారంతోపాటు పండ్ల తోటలు పెంచే జిల్లాలోని రైతులకు కూడా ఉపయోగపడనున్నాయి.

జిల్లాలోనే ఉత్పత్తి చేస్తాం


- సూర్యనారాయణ, ఉద్యానవన శాఖాధికారి
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి అంట్లను ఉత్పత్తి చేయనున్నాం. ఇతర జిల్లాల మీద ఆధారపడకుండా జిల్లాలోనే నర్సరీలో పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే స్థ లాన్ని ఖరారుచేసి పనులు ప్రారంభిస్తాం. దీంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా తీసుకునే హరితహారంతోపాటు మామిడి రైతులకు ఎంతో మేలు జరగనుంది.

272
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS