పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి


Fri,February 17, 2017 01:04 AM

నెల్లికుదురు, ఫిబవ్రరి16 : రాజరిక వ్యవస్థను నిర్మూలించేందుకు సర్వాయి పాపన్నగౌడ్ నిర్వహించిన పోరాటాలను అన్ని వర్గాలవారు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, గౌడ సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం గౌడ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గండు రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో స్వామిగౌడ్ పాల్గొని మాట్లాడారు.

బహుజనుల కోసం పాపన్న అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. నిరంకుశ పాలకులకు ఎదురుతిరిగి పోరాడినందుకు పాప్పన్న తలను, మొండాన్ని వేరుచేసి మెండాన్ని గోల్కొండకోటకు వారం రోజులు వేలాడదీశారని తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు కుల, మతాలకతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. జాతికోసం పోరాడిన యోధులను కులాలకతీతంగా ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలన్నారు. అన్ని కులాలు, మతాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, బలహిన వర్గాలే బంగారు తెలంగాణకు బాసటగా నిలవాలని స్వామిగౌడ్ కోరారు.

కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు. పోరాట యోధులను గుర్తించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గౌడ కులస్తులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 74ఎకరాల భూమిని గౌడ కులస్తులకు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్‌దేనన్నారు. ప్రతీ గ్రామంలో గౌడ కులస్తులు సొసైటీలుగా ఏర్పడాలని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది సొసైటీల ద్వారానే అందుతుందని చెప్పారు.

సొసైటీలను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియాకు సొసైటీలతో ముడిపెట్టిందని తెలిపారు. అనంతరం మహబూబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ 60ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే చూపించిందని, రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలే మరతాయని తెలిపారు. కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. తెలంగాణ పండుగలకు, కులవృత్తుల వారికి, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తున్నారన్నారు.

అనంతరం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను భారీ పూలమాలతో ఘనంగా సన్మానించారు. కాగా కళాకారులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మండ సుష్మా, జిల్లా అధ్యక్షుడు మెర్గు శంకర్, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గండు రాజు, కొయ్యెడి వెంకటేశ్వర్లు, బీసీ ససంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాస్, వ్యవస్థాక అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, గౌడ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ది వెంకట్‌నారాయణ, శేషగిరి, సత్యనారాయణ, యాదగిరి, సుజాత, చంద్రమౌళి, గుంషావలీ, బుచ్చయ్య, స్వప్న, రాజు, కదునూరి కవిత, గడ్డం పద్మ, జేసీ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS