సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలి

Fri,February 17, 2017 01:03 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి16 : బహుజనులను చైతన్యం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. గురువారం డివిజన్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం పక్కన ఉన్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గోపా జిల్లా క్యాలెండర్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తోందన్నారు. ప్రతీ గ్రామంలో కుంట, చెరువు కట్టలపై ఈత, తాటి చెట్లు పెంచి గీత కార్మికులకు స్వయం ఉపాధి కల్పి స్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షులు యాకయ్య, సహాయ కార్యదర్శి రమేశ్, రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు వెంకన్న, కేఏపీఎస్ గౌరవ అధ్యక్షుడు ఐలయ్య, టీఆర్‌ఎస్ నాయకులు వేంకటనారాయణగౌడ్, తెలంగాణ గౌడ సంఘం మండల అధ్యక్షుడు లింగన్నగౌడ్, అశోక్, శ్రీనివాస్, వెంకన్న, శ్రీధర్, యాదగిరి, శ్రీనివాస్, రామచంద్రయ్య, చీకటి భూపాల్‌గౌడ్, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...