వీరభద్ర ఉత్సవ కమిటీకి నియామక పత్రం అందజేత

Fri,February 17, 2017 01:02 AM

కురవి, ఫిబ్రవరి 16: కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయ ఉత్సవ కమిటీ నియామక పత్రాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఉత్సవ కమిటీ చైర్మన్ బాదావత్ రాజునాయక్‌కు గురువారం రాత్రి అందజేశారు. వీరు శుక్రవారం నుంచి మార్చి 31వ తేదీ వరకు ఉత్సవ కమిటీ సభ్యులుగా కొనసాగుతారని, తదుపరి కమిటీని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. పాలక మండలి సభ్యులంతా జాతర విజయవంతం, ఆలయ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. ఎమ్మెల్యే రెడ్యా వెంట ఓడీసీఎంస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య,మండల అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, కొణతం విజయ్, దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, టేకుల యాదగిరిరెడ్డి, మల్లెపాక మధు, వేణు, కో ఆప్షన్ సభ్యులు అయూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...