హాస్టల్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి


Fri,February 17, 2017 01:00 AM

మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: జిల్లాలోని హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజెస్ వర్కర్స్‌ను వెంటనే పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు కోరారు. గురువారం డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం కొమ్ము వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 25 ఏళ్లుగా డైలీ వేజెస్ వర్కర్స్ పనిచేస్తున్నా వారికి హక్కులు, చట్టాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రతినిధి వర్గం డైలీ వేజెస్ వర్కర్స్ సమస్యలపై జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి టి.నారాయణస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు భూక్య వీరన్న, కొమ్ము వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS