విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Fri,February 17, 2017 12:59 AM

కేసముద్రం రూరల్, ఫిబ్రవరి 16: విద్యార్థులు క్రీడలతోపాటుగా చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి సూచించారు. కేసముద్రం విలేజ్ శ్రీవివేకవర్థిని హైస్కూల్ విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించగా, గురువారం నిర్వహించిన విద్యార్థుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం, దేహ దారుఢ్యం పెంపొందుతుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ చిర్ర యాకాంతంగౌడ్, కొలిపాక వెంకన్న, తుంపిళ్ల వెంకటేశ్వర్లు, తైక్వాండో కోచ్ కల్లెపల్లి రమేష్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...