నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలి

Fri,February 17, 2017 12:59 AM

గార్ల, ఫిబ్రవరి 16: నిత్యావసర సరుకులను మండలంలో రేషన్‌డీలర్లు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని తహసీల్దారు అనంతుల రమేష్ అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎద్దు మాధవి అధ్యక్షతన సమావేశ జరిగింది. మండలంలోని రేషన్ షాపు డీలర్లకు ఆయన సూచనలు చేశారు. మండలంలో 32 చౌకధరల దుకాణాలు ఉన్నాయన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒకటి నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేయాలన్నారు. ముగింపు రికార్డులను ప్రతి నెల 16న, కిరోసిన్‌కు రికార్డులను ప్రతీ నెల 30, 31వ తేదీల్లో తమ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీల్లో చేర్చిన పిల్లలకు ఐదేళ్లు పూర్తయిన వెంటనే రేషన్ కార్డుల్లో వారి పేర్లు చేర్చాలన్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, మృతి చెందిన వారి పేర్లను కార్డు నుంచి వెంటనే తొలగించాలని డీలర్లకు సూచించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...