గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి : జెడ్పీటీసీ

Fri,February 17, 2017 12:59 AM

గూడూరు, ఫిబ్రవరి 16: గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పని చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు ఎండీ.ఖాసీం, తహసీల్దార్ లక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాలనుసారంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో మండలంలోని గ్రామాల అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశాన వాటికలు, దోభీఘాట్లకు స్థలాలను గుర్తించాలని, గొర్రెలకాపరుల వివరాలను సేకరించాలని, గ్రామాల్లో నాయీబ్రహ్మణలకు క్షౌరశాలలను ఏర్పాటు చేసి, అవసరమైతే రుణాలు అందించాలని, బీడీ కార్మికులకు పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని, గ్రామాల్లో డంప్ యార్డులకు స్థలాలు కేటాయించాలని సర్పంచ్‌లు, వీఆర్వోలు, కార్యదర్శులకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సురేందర్‌నాయక్, ఈవోపీఆర్డీ, వీఆర్వోలు, కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...