జాతర పనులు షురూ..


Fri,February 17, 2017 12:58 AM

కురవి, ఫిబ్రవరి 16 : ఈనెల 24న జరిగే భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవంతోపాటు కోర మీసాల మొక్కు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కురవి వీరన్న జాతర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్ల విస్తరణ పనులు చేస్తుండగా, కల్యాణ వేదిక ప్రాంగణం, సంత పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ పంచాయతీ కార్యాలయం నుంచి వీరభద్రస్వామి కల్యాణ మండపం వరకు రోడ్లపై నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. పోలీసులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 రోజులపాటు పోలీస్ అధికారులంతా కురవిలోనే ఉంటూ పనులను పరిశీలిస్తారన్నారు. డీఎస్పీ వెంట సీఐ కృష్ణారెడ్డి, కురవి ఎస్సై అశోక్, ఉత్సవ కమిటీ సభ్యుడు బాదావత్ రాజునాయక్ తదితరులు ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS