వర్మికంపోస్టుతో అధిక దిగుబడి

Fri,February 17, 2017 12:58 AM

కేసముద్రం టౌన్, ఫిబ్రవరి 16 : వర్మికంపోస్టును ఉపయోగంతో భూమిలో పోషక విలువలు పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చని హార్టీకల్చర్ అధికారి సమ్మయ్య రైతులకు సూచించారు. ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 30 మంది గిరిజన రైతులకు వర్మికంపోస్టు యూనిట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల రైతులు ఆర్థికంగా నష్టంతోపాటు దిగుబడి తగ్గుతుందని తెలిపారు. వర్మికంపోస్టును తయారు చేసుకొని వినియోగించడం మూలంగా భూమి సారవంతంగా మారుతుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవణ విస్తరణాధికారి రమేష్, రైతులు రూప్‌సింగ్, భీమా, లక్ష్మి, జామ్లా, బాలు తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...