కేంద్రం రైల్వే కేసులు ఎత్తివేయాలి

Fri,February 17, 2017 12:58 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 16 : తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పిలుపు మేరకు రైల్‌రోకో కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన కేసులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని జేఏసీ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ కోరారు. గురువారం కాజీపేటలోని రైల్వే కోర్టుకు డోలి సత్యనారాయణతోపాటు డోలి లింగుబాబు, మైల చంద్రమౌళి, బీబీ రాఘవులు, గుంజె హన్మంతు హాజరయ్యారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ 2014లో 246/14 సీసీ నెంబర్ గల కేసులో న్యాయమూర్తి ముందు హాజరైనట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే కేసులు, తెలంగాణ ఉద్యమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని కోరారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...