నూతన వ్యవసాయ పద్ధతులు పాటించాలి

Fri,February 17, 2017 12:58 AM

-జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్
కురవి, ఫిబ్రవరి 16 : రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ పంటలు సాగుచేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని మేక వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సంప్రదాయ విధానంలో పత్తి సాగు చేసే విధానంపై అవగాహన కల్పించారు. శక్తిమాన్ కంపెనీ రోటర్‌గ్రేడర్ పరికరం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, రైతులు పత్తి ఏరిన తరువాత మొక్కలను పీకి కాల్చివేయడం ద్వారా భూమిలో పోషకాలు చనిపోవడంతోపాటు భూసారం దెబ్బతింటుందని వివరించారు. పత్తి ఏరిన తరువాత ఈ రోటర్ గ్రేడర్‌తో మొక్కలను పిప్పి చేయడం ద్వారా భూమిలో కలిసిపోయి, భూసారం పెరుగుతుందన్నారు.

దీని ద్వారా మొక్కల పెరుగుదలతోపాటు భూమిలో మైక్రో పోషకతత్వాలు, జింక్ సల్ఫర్, పొటాషియం, నైట్రోజన్ భూమిలోకి చేరుతాయన్నారు. ఎకరానికి రూ. 700 నుంచి రూ. 900 వరకు ఖర్చు అవుతుందని, గతంలో మాదిరిగా అయితే రూ. 3 వేలకు పైగా ఖర్చుతోపాటు భూసారం దెబ్బతింటాయన్నారు. 45 హెచ్‌పీ ట్రాక్టర్‌కు ఈ రోటర్ గ్రేడర్ పరికరాన్ని బిగించాలన్నారు.

మార్కెట్ ధర రూ. 1లక్ష 50 వేలు ఉన్నప్పటికీ, రూ. 50 వేల సబ్సిడీతో ఈ పరికరాన్ని రైతులు కొనుగోలు చేసుకుని వ్యవసాయాన్ని సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మంజుఖాన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, ఏఈఓలు మాలోతు రమేష్, రాజేశ్వరి, బానోతు కల్యాణ్, శిరీష, కె.వి.కె శాస్త్రవేత్త సరళాకుమారి, ఎంటమాలజిస్ట్ రాములమ్మ, రైతులు మేక నాగిరెడ్డి, బెడద వీరన్న, మింగు సమ్మయ్య, రామునాయక్, రామానాయక్, వద్దుల పుల్లారెడ్డి, బెడద విశ్వనాధం, తరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...