యువత లక్ష్యంతో ముందుకు సాగాలి

Fri,February 17, 2017 12:57 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 16: నేటి తరం యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని, వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, విజ్ఞాన భారతి విద్యా సంస్థల అధినేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు సూచించారు. స్థానిక విజ్ఞాన భారతి డిగ్రీ, పీజీ కాలేజీలో గురువారం కల్చరర్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రవీందర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే రాణిస్తారని సూచించారు. వ్యవనాలకు దూరంగా ఉండాలన్నారు.

ప్రతీ విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాలు ఏర్పర్చుకుని, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అలాగే, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వం యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ వెంకటమల్లు, కళాశాల డైరెక్టర్ సంధ్యారాణి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...