రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం


Fri,February 17, 2017 12:57 AM

దంతాలపల్లి, ఫిబ్రవరి 16 : రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాసంగి పంటలకు నీరందించేందుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపుతున్నామన్నారు. గోదావరి జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మంత్రిని కోరామని, దీనికి స్పందించిన ఆయన వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. రామవరం, పెద్దముప్పారం, నిదానపురం, కుమ్మరికుంట్ల, రేపోణి, లక్ష్మీపురం గ్రామా ల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఈ నెల 27న మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా చెక్‌డ్యాంల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న మహాశివరాత్రి సందర్భంగా కురవికి రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS