సమస్యలు పరిష్కరించాలని.. గ్రామాల్లో ప్రచారం

Fri,February 17, 2017 12:57 AM

మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: రైతులకు సాదా బైనామా పట్టాలు ఇవ్వాలని, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి అందించాలని, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ మేరకు శనిగపురం, పర్వతగిరి, రోకలిబండ తండా, జంగిలిగొండ, వీఎస్‌లక్ష్మీపురం, సింగా రం, గుండాలగుడ్డతండా, అమనగల్, అయోధ్య, ముడుపుగల్‌లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కట్లోజు పాండురంగాచారి, కొమ్ము నారాయణ, తండా సందీప్, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు అజ్మీరా వేణు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...