లక్ష్యం.. అలక్ష్యం..!

Thu,February 16, 2017 01:59 AM

-అమలు కాని స్వచ్ఛభారత్ మిషన్
-నత్తనడకన సాగుతున్న మరుగుదొడ్ల నిర్మాణం
-ఇంకా ప్రారంభం కాని 782..
-వివిధ దశల్లో కొనసాగుతున్న 573..
-పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు
-ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోని వైనం..

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అధికారుల మిషన్‌కు పూర్తిస్థాయిలో నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు మానుకోటలో నత్తను మించిపోయింది. జనవరి 26లోగా ప్రతీ ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు దానిని చేరుకోలేకపోయారు. నిర్దేశించుకున్న గడువుదాటి 20 రోజులు గడిచినప్పటికీ దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు కార్యాలయాలను వీడడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం నీరుగారుతోంది. మానుకోటలో ఈ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు 1782 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 425 నిర్మాణం పూర్తికాగా, 573 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 782 ప్రారంభం కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి సారించకపోవడంతో సిబ్బందిలో అలసత్వం పెరిగిపోతోంది.

అధి కారుల అలసత్వం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు. వేలకోట్లు వెచ్చించి పేద, మధ్య తర గతి వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అ మలు కావడం లేదు. మహబూబాబాద్ పట్టణంలో మరుగుదొ డ్లను జనవరి 26లోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా పెట్టుకుంది.

అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఉన్నతాధికారులు ప్రభు త్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమవుతున్న తీరును ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తే పనుల వేగం పెరిగే అవకాశం ఉందని పలువు రు అంటున్నారు. బహిరంగ మలవిసర్జనను నిరోధించాలనే ఉ ద్దేశంతో స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) పథకాన్ని కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి మానుకోట పట్టణంలో ఆదిలోనే ఇ బ్బందులు తప్పడంలేదు.

అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన లో పించడంతో లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ముగ్గుపో సిన దగ్గరి నుంచి మరుగుదొడ్డి పూర్తి చేసే వరకు మున్సిపాలిటీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారులు ఎదుర్కొం టున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచాల్సి ఉంటుంది.

1782 దరఖాస్తులు..


మానుకోట పట్టణంలో మొత్తం 17,750 గృహాలుండగా, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు 1,782మంది దరఖాస్తు చే సుకున్నారు. ఇందులో రెండు దరఖాస్తులు తిరస్కరణకు గుర య్యాయి. వీటిలో 998 దరఖాస్తుల జియోట్యాగింగ్ పూర్తికా గా, మరో 782 పెండింగ్‌లో ఉన్నాయి. జియోట్యాగింగ్ పూర్తి చేసిన వాటిలో 425 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు.

మిగి లిన 573 వివిధదశల్లో ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మా ణానికి రూ.4వేలు కేంద్రప్రభుత్వ, రూ.8వేలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లిస్తున్నారు. మొదటి విడతలో పునాది పనులు పూ ర్తికాగానే రూ.6వేలు, గోడలుకట్టి బేసిన్ కూర్చోబెట్టిన తరువా త రెండో విడతలో మరో రూ.6వేలు లబ్ధిదారుని బ్యాంకు ఖా తాలో జమచేస్తారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న 425 లబ్ధి దారుల్లో ఇప్పటి వరకు 396మందికి బిల్లులు చెల్లించగా, 29 మందికి జమచేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు.

ఇంకా ప్రారంభం కాని 782..


మానుకోట పట్టణంలో 782 మరుగుదొడ్ల పనులు ఇంకా ప్రారంభంకావాల్సి ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిం చి పనుల వేగం పెంచాల్సి ఉండగా, వారి అలసత్వం వల్ల ప నుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణ పనులు చూడాల్సి న బాధ్యత డీఆర్‌డీఏ శాఖదని మున్సిపాలిటీ అధికారులు త ప్పించుకుంటున్నారు. తమది కేవలం బిల్లులు ఇచ్చేపని అని, నిర్మాణ పనులు చూడాల్సిన బాధ్యత ఐకేపీ వారిదని డీఆర్డీఏ అధికారులు వాదిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..


మానుకోట మున్సిపాటిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బిల్లులు మాత్రమే చెల్లిస్తామని.. నిర్మాణ బాధ్యతలు మాత్రం ఐకేపీ వారు చూసుకోవాలని మున్సిపాలిటీ అధికారులు చెబు తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో మరుగుదొడ్ల నిర్మాణాలు బాగా నెమ్మదించాయి.

ప్రజాప్రతినిధులు హెచ్చరించినా..


జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హెచ్చరించినా అధికారు ల పనితీరులో మార్పు రావడం లేదు. ఇటీవల కలెక్టరేట్‌లో ని ర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తీరు పై ఎంపీ సీతారాంనాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం లో జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా, జేసీ దామోదర్‌రెడ్డిలు కూడా కమి షనర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాకు చెందిన స్థా నిక ఎమ్మెల్యేతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ పని తీరు బాగాలేదని, ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పలుమా ర్లు చర్చించుకున్నారు. కమిషనర్ వ్యవహార శైలి సరిగా లేదని కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వేధిస్తున్న ఇసుక సమస్య...


ఒక మరుగుదొడ్డిని నిర్మించాలంటే కనీసం ట్రాక్టర్ ఇసుక అవసరం. లబ్ధిదారుడు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే కనీసం రూ. 3 వేల నుంచి 4 వేలు అవుతుంది. అయితే లబ్ధిదారుడు కొందామన్నా ఇసుక దొరకపోవడంతో దూర ప్రాంతాల నుంచి తెప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.

దీనికి డబ్బులు ఎక్కువ వుతుండడంతో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిగా డీలా పడింది. ఇసుక దొరకకపోవడం.. దొరికినా భారీగా డిమాండ్ ఉండటం వల్ల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఇసుక సమస్యను పరిష్కరించాల్సి న అవసరం ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు తక్కువ ధరకు ఇసుక అందే విధంగా చూడాలని లబ్ధి దారులు కోరుతున్నారు.

ఇసుక సమస్యతో నిలిచాయి


- రాజేందర్, మున్సిపల్ కమిషనర్
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా అమలవుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడింది. దీంతో నిర్మాణాలు ఆ గిపోయాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రీతిమీనాతో పాటు జి ల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలో ఇసుక సమస్యను అధిగమిస్తాం. లబ్ధిదారులకు ప్రత్యేక కూపన్ల ద్వారా ఇసుక తెచ్చుకునే విధంగా అనుమతులు తీసుకురాను న్నాం. ఇప్పటికే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. త్వరలోనే సమస్య పరిష్కరించి నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. ఇప్పటికే నిర్మించుకున్న లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా లో డబ్బులు వేస్తున్నాం.

90
Tags

More News

మరిన్ని వార్తలు...