గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి కృషి చేయాలి

Thu,February 16, 2017 01:54 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 15: గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,500 కోట్ల ఖర్చుతో ఈ ఆర్థిక సంవత్సరం 2 లక్షల గొర్రెల పెంపకందారులకు యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు.

జిల్లాల్లో గ్రామాల వారీగా యాదవ్, కుర్మల వివరాలు సేకరించాలన్నారు. గొర్రెలు, మేకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల, పిడుగురాళ్ల, గిద్దలూరు నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అటవీ శాఖ, పశు సంవర్ధకశాఖ సంయుక్తంగా ైస్టెలో హెమాటో అనే పచ్చిగ్రాసం పెంచాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీలో పశువులకు మంచినీటి తొట్టెలు, పశు పాకల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పశు వధశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

విజయ డైరీ సహాయంతో 10 వేల లీటర్ల సామర్థ్యం గత పాలశీతలీకరణ కేంద్రాలను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ జిల్లాలో 16,2 15 గొల్ల, కుర్మ యాదవులు ఉన్నారని, జిల్లాకు 5278 యూనిట్ల లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో 4,31,255 గొర్రెలు, 1,42,996 మేకలు ఉన్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మానుకోట నుంచి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్, డాక్టర్లు రాంచందర్, అశోక్ పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...