ఖాతా నుంచి రూ. 20 వేలు మాయం

Thu,February 16, 2017 01:53 AM

నెల్లికుదురు, ఫిబ్రవరి 15 : బ్యాంకు ఖాతా నుంచి రూ. 20 వేలు మాయమైన ఘటన మండలంలో ని చిన్ననాగారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడు గుండ్ల సుధాకర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు కేసముద్రం మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో ఖాతా ఉందన్నారు. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి 9507376737 నెంబర్‌తో ఫోన్ చేసి బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, ఏటీఎం పిన్ నెంబర్ ఇవ్వాలని కోరడంతో చెప్పానన్నారు. కొద్ది సమయంలోనే తన ఖాతా నుంచి రూ. 20 వేలు డ్రా చేసినట్లు సెల్‌కు మెస్సేజ్ వచ్చిందని, సంబందిత ఉన్నతాధికారులు స్పందించి తన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...