ఇస్రో విజయాన్ని హర్షిస్తూ విద్యార్థుల ర్యాలీ


Thu,February 16, 2017 01:53 AM

మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15: ఇస్రో ఆధ్వర్యంలో పీఎస్‌ఎల్‌వీసీ 37 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూలు విద్యార్థులు బుధవారం ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల వెంట ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూ, ప్ర శంసిస్తూ నినాదాలు చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసరి మధు, డీన్ లక్ష్మీనారాయణ, ఏవో సుధాకర్, రమేశ్, సందీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కంబాలపల్లి పాఠశాలలో మానవహారం
ఇస్రో ఆధ్వర్యంలో ఒకేసారి 104 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి విజయం సాధించడాన్ని హర్షిస్తూ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థులు మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మైస శ్రీని వాసులు, ఉపాధ్యాయ బృందం జి.వెంకటేశ్వర్లు, వి.గురునాథరావు, కె.గిరిజ, బి.రాజు, బి.సతీశ్‌కుమార్, సీహెచ్.ఉపేందర్, ఎస్.సైదులురెడ్డి, కె.శ్రీవాణి, బి.మహేశ్, బి.కిషన్, టి.వనజ, ఇ.శ్రీధర్, వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS