మార్చి 31లోపే సబ్సిడీ రుణాలను అందజేస్తాం

Thu,February 16, 2017 01:52 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి15 : మార్చి 31లోపే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా మార్గ మధ్యలో స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరుకు అర్హత పొందిన యువతకు ఈ రుణాలను ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో ఇస్తుందన్నారు. మార్చి తర్వాత 2017-18ఆర్థిక సంవత్సరం ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 90శాతం సబ్సిడీపై రుణాలు ఇచ్చేలా తనవంతు కృషిచేస్తానన్నారు. సేద్యానికి ఉపయోగపడే ట్రాక్టర్లను 90శాతం సబ్సిడీపై ఇప్పటికే అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

రిజరేష్వన్ల అమలు బాధ్యత కేంద్రానిదే..
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పిడమర్తి రవి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎస్టీలు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల అమలు కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో జేఏసీనీ ఏర్పాటు చేసి పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం చారి శ్రీనివాస్, ఊరుగొండ రవి మాట్లాడుతూ త్వరలో కోసం ఐక్య కార్యాచరణకు మరిపెడను వేదికగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు వెంకన్న, సుమన్, గొల్కొండ వెంకన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...