సమాజ సేవలో భాగస్వాములవుతాం..

Thu,February 16, 2017 01:52 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి15 : సమాజ సేవలో కూడా భాగస్వామలమవుతామని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ తెలిపారు. బుధవారం అనంతాద్రి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహించిన రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి హరికిషన్ జవర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటనారాయణగౌడ్ మాట్లాడారు. రైస్‌మిల్లర్లు రైతులకు ఎంతగానో దోహదపడుతున్నారన్నారు. ప్రభుత్వ పరంగా రైస్‌మిల్లర్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన రైస్‌మిల్లులకు విధిస్తున్న కరెంట్ బిల్లుల్లో రాయితీ ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం ధాన్యం మిల్లుల్లో పట్టేందుకు క్వింటాల్‌కు కేవలం రూ.30 మాత్రమే చెల్లిస్తోందని ఈ మొత్తాన్ని రూ.వందకు పెంచాలని కోరారు. ప్రతీ ఏడాది ధాన్యం ధరలు పెంచుతోందని, కానీ మిల్లింగ్ ధరలు పెంచకోపోవడం దారణమని అన్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడిగా డీఎస్.రవిచంద్ర, ఉపాధ్యక్షులుగా వోలం కృష్ణమూర్తి, ప్రతాపని పాండురంగయ్య, ప్రధాన కార్యదర్శిగా తల్లాడ అంబరీశ, అర్గనైజింగ్ సెక్రటరీగా దీపక్ జావర్, సంయుక్త కార్యదర్శులుగా గర్రెపల్లి ఉపేంద్రగుప్తా, వనమాల నాగేశ్వర్‌రావు, ఈససాని వెంకటేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా రేగూరి సోమయ్య, ముఖ్య సలహాదారులుగా గండి రమేశ్‌గౌడ్, వోలం రాజేశ్వర్‌రావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తోట సంపత్‌కుమార్, దుబ్బా రమేశ్, జుగల్ కిశోర్ ఖండేల్‌వాల్, వేమిశెట్టి ఏకాంబరం, గోపాల్ జవర్, ప్రకాశ్ ఖండేల్వాల్, గోపారపు నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...