గిరిజనుల ఆరాధ్య దైవం

Thu,February 16, 2017 01:51 AM

కురవి: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ అని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మండలకేంద్రంలో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సేవాలాల్ జయంతి సందర్భంగా నియోజకవర్గానికి 4 లక్షల 3 వేల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులను నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఆనంద్‌కుమార్ ఆయా మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సేవాలాల్ ఆలయాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. కార్యక్రమంలో జేసీ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణవేణి, డీటీడీవో నారాయణస్వామి, ఏటీడబ్ల్యూవో దేశ్‌రాం, మోహన్‌రావు, జెడ్పీటీసీ కొణతం కవిత, మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్, సర్పంచ్‌లు గుగులోత్ పూర్ణ, జాటోత్ ఈశ్వరీ, దళ్‌సింగ్, ఎంపీటీసీలు లింగ్యానాయక్, జామానాయక్, గుగులోత్ రవి పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...