బియ్యం ధరలు పెరిగాయ్..!


Thu,January 12, 2017 02:30 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగా ణ : బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రైతులు పండించిన సన్న ధాన్యాలకు మార్కెట్లో మా త్రం ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. క్వింటాల్ బియ్యానికి ఏకంగా రూ.200 నుంచి రూ.250 వరకు వ్యాపారులు పెంచేశారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని కోరితే వ్యాపారులం తా సిండికేట్ అయి నిలువునా ముంచుతున్నారు. ప్రజ లు సన్న బియ్యం కొనుగోలు చేద్దామంటే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను అదుపు చేయాల్సిన అధికారులు ప ట్టించుకోవడం లేదు. వానాకాలంలో వరి పంటను రై తులు అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుత సీజన్‌లో కా లం సరిగా కాకపోవడం వల్ల రైతులు సాగుచేయలేని పరిస్థితి నెలకొంది. వానాకాలం తరువాత యాసంగి పంటకు ముందు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురిశాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 1361 చెరువులు నిండాయి. అక్కడక్కడా నిండని చెరువులను ఎస్సారెస్పీ డీబీఎం 48 ద్వారా నింపడంతో యా సంగిలో పంటలను అధికంగా సాగుచేస్తున్నారు.

ప్రస్తుత ధరలు ఇలా..


ప్రస్తుతం పాత సన్న బియ్యం ధరలు క్వింటాల్‌కు రూ.400ల వరకు పెంచేశారు. కొత్త వాటికి ఏకంగా రూ.300 వరకు ధర పెరిగింది. రైతుల వద్ద నుంచి సన్నరకం ధాన్యాలను తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల వద్ద పెద్దగా సన్నరకాల ధాన్యం లేకపోవడం గుర్తించిన వ్యాపారులు బియ్యం ధరలను విపరీతంగా పెంచేశారు. పాత సన్న రకాల బి య్యం ధరలు క్వింటాల్‌కు రూ.3,800 నుంచి రూ. 4,200 వరకు పెంచారు. సన్నరకాల్లో కొత్త బియ్యం క్వింటాల్ ధర రూ. 2,800 నుంచి రూ.3,200 వరకు చేరింది. ఒకేసారి క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ. 400 ల వరకు ధరలు పెరగడంతో ప్రజలకు భారంగా మారింది.

వ్యాపారుల సిండికేట్..


జిల్లా వ్యాప్తంగా బియ్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. రైతుల వద్ద ఉన్న సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.1,610 వెచ్చించి మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రూ.1650-1700 వరకు కొనుగోలు చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు సిండికేట్‌గా మారి సన్న రకాల బియ్యం రేట్లను పెంచేశారు. ఒకేసారి సన్న బియ్యం కొత్త రకానికి రూ.300, పాత బియ్యానికి క్వింటాల్‌కు రూ.400 పెరిగింది.

పెరిగిన ధరలను అదుపు చేస్తాం


- లక్ష్మణ్, పౌరసరఫరాల శాఖ అధికారి
గత రెండు రోజుల్లో బియ్యం ధరలు పెరిగినట్లు నా దృష్టికి రాలేదు. వ్యాపారులంతా సిండికేటై ధరలు పెంచితే సహించేది లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బియ్యం షాపులపై దాడులు నిర్వహిస్తాం. నేను కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు, బియ్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించి ముందుగా వివరిస్తా. అయినా వ్యాపారులు దారికి రాకుంటే దాడులు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

265
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS