సుహృద్భావ వాతావరణం కొనసాగాలి


Thu,January 12, 2017 02:27 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 11: క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతరలతో సుహృద్భావ వాతావరణం పెంపొందాలని జిల్లా ఎస్పీ జె. మురళీధర్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పోలీసులు, మీడియా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ పోటీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నాకు క్రికెట్ అంటే అమితమైన ప్రేమ అని పేర్కోన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడం నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌పై ఉన్న ఆసక్తి మరే క్రీడకు లేదని స్పష్టం చేశారు. రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన మన దేశ జట్టుకు స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది క్రికెట్ ఆడేందుకు ముందుకు రావడం విశేషమన్నారు. నిరంతరం పనుల ఒత్తిళ్లతో బిజీగా ఉండే ప్రెస్, పోలీసులు అప్పుడప్పుడు ఆటవిడుపుగా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇలాంటి పోటీల్లో పాల్గొంటే కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. అందుకోసం ప్రతి మండలంలో క్రీడాపరికరాలను అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల్లో ఆడే కబడ్డీ, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, చెస్ లాంటి పోటీలను యువకులతో పోటీలు చేపడుతామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి అదేశాల మేరకు ప్రజాసౌలభ్యం కోసం కొత్త జిల్లాలు అందుబాటులోకి రావడం.. జిల్లా స్థాయి అధికారులు సైతం ప్రజల చెంతకు చేరుకోవడం విశేషం. అలాగే ప్రజలతో పోలీసులు స్నే హపూర్వకంగా మె దులుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతం తో అనుబంధం కలిగిన తనకు ఇక్కడ తొలి జిల్లా ఎస్పీగా పనిచేసే అవకాశం ల భించిందన్నారు. ఈ ప్రాంత అభివృద్దితో పాటు జిల్లాలో శాం తి భద్రతలు కాపాడేందుకు తనవంతు గా కృషి చేస్తానని చెప్పారు. ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మెరుగుపర్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ఉత్సాహంగా పోటీ...
ఎస్పీ నాయకత్వంలో పోలీసు టీం, మీడియా ప్రతనిధుల పక్షాన పర్కాల రవీందర్‌రెడ్డి కెప్టెన్సీ వహించిన ఈ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరితంగా కొనసాగింది. తొలుత ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించారు. ఎస్పీ ఈ పోటీల్లో పాలొనే వారిని పరిచయం చేసుకుని, టాస్ వేశారు. 12 ఓవర్ల ఈ మ్యాచ్‌ను ఎలక్ట్రానిక్ ప్రతినిధుల జట్టు ప్రింట్ మీడియా జట్టుపై విజయం సాధించింది. అనంతరం పోలీసులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కూడిన జట్ల మధ్య పోటీని నిర్వహించారు. గెలుపొందిన పోలీస్ జట్టుకు ఎస్పీ మురళీధర్ డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్‌కు కప్‌ను అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన మీడియా జట్టు కెప్టెన్ పర్కాల రవీందర్‌రెడ్డికి షిల్డును అందజేశారు. కార్యక్రమంలో టౌన్, మరిపెడ, బయ్యారం సీఐలు జబ్బార్, శ్రీనివాస్‌నాయక్, సాంబయ్య, ఎస్సైలు కమలాకర్, రాణాప్రతాప్, సతీష్, మీడియా ప్రతినిధులు కె.రాజు, గజవెల్లి రాజు, అర్రం రమేశ్‌చందర్, కట్ల రాజు, తప్పెట్ల రాజు, బలగాని నవీన్, ఆమెడ శ్రీధర్, కిరణ్, మురళి, మధుగౌడ్, కృష్ణ, ఉప్పలరంగా, కల్లూరి ప్రభాకర్, రేఖవర్మ, రామకృష్ణారెడ్డి, దేశబోయినరాధాకృష్ణ, చుక్కల మధు, రాంప్రసాద్, శ్రీపాదశ్రీనివాసచారి, భువనగిరి ప్రసాద్, పల్లెశ్రీనివాస్, రాజు, యాకయ్య, విశాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అజయ్ తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS