రియల్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు


Thu,January 12, 2017 02:27 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి 11: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగం నమోదుపై ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఖానాపురం మండలం ఎంపీడీవో మిట్టకోల చంద్రమౌళి ఇంటిపై, ఆయన ఆర్ధిక లావాదేవీలతో సంబంధాలు ఉన్న వ్యక్తుల గృహాలపై బు ధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సో దాలు నిర్వహించారు. తొర్రూరు మండలం హ రిపిరాల గ్రామానికి చెందిన చంద్రమౌళి హన్మకొండలోని దీన్‌దయాళ్ నగర్‌లో నివాసం ఉం టున్నారు.

తొర్రూరులో కూడా ఇతనికి ఆస్తులు ఉండడంతో వాటి విక్రయాల వ్యవహారంలో స్థానిక రియల్టర్ బిజ్జాల శ్రీనివాస్‌కు సంబంధాలు ఉన్నాయన్న అభియోగంతో ఆయన ఇం ట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉద యం 6గంటలకే శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, వరంగల్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ అధికారి బి.రమేశ్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణతో కూడిన బృందం శ్రీనివాస్ ఇంట్లోని ఆస్తుల పత్రాలను, పలు దస్తావేజులను పరిశీలించారు. చంద్రమౌళికి శ్రీనివాస్ బినామీగా వ్యవహరించాడన్న అభియోగంతో ఈ సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. 2011 లో చంద్రమౌళికి తొర్రూరులో ఉన్న 242 చదరపు గజాల స్థలంలోని జీ ప్లస్‌వన్ గృహాన్ని బిజ్జాల శ్రీనివాస్ రూ.29లక్షలకు కొనుగోలు చేసి జీపీ ఏ చేయించుకోవడంతో శ్రీనివాస్‌పై అనుమానాలు రేకెత్తాయి. 2014లో ఈ ఇంటిని శ్రీనివాస్ తన భార్య రాజేశ్వరి పేరున రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకులో రూ.20లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ విక్రయానికి సంబంధించిన దస్తావేజుల జిరాక్స్‌లను తదుపరి దర్యాప్తు నిమిత్తం ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. చంద్రమౌళితో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ఏవైనా వ్యవహారాలు కొనసాగాయా అన్న కోణంలో శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS