మార్కెట్‌కు సెలవులు


Thu,January 12, 2017 02:27 AM

కేసముద్రంటౌన్/ మహబూబాబాద్ రూర ల్, జనవరి 11: ఈ నెల 12 నుంచి 16 వరకు మార్కెట్‌కి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ బీరవెళ్లి ఉమ ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 5 రోజులు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు. మార్కెట్ లేని సమయాలలో రైతు సోదరులు తమ సరుకులను విక్రయానికి తీసుకవచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. మానుకోట వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 13నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సుచిత్ర ఒక ప్రకటనలో తెలిపారు. 16తేదీ నుంచి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS