క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి


Thu,January 12, 2017 02:26 AM

కేసముద్రం రూ రల్, జనవరి 11 : క్రీడ లు స్నేహభావాన్ని పెపొందిస్తాయని మానుకో ట ఎమ్మెల్యే బా నోత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో స్టార్‌యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి కబడ్డీ, క్యారం పోటీలకు ముఖ్య అథితిగా ఆయన హాజరై ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలోని శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుభంతో స్వాగతం పలికి, అర్చన చేసి పూజలు నిర్వహించారు. స్వామివారి కండువాను కప్పి సన్మానించారు. అనంతరం క్రీడా ప్రాగణానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్రాడాకారులలోనినైపుణ్యాన్ని వెలికితీసి యువతలో ఐక్యమత్యాన్ని చాటడానికి ఈ క్రీడలు దోహద పడతాయాన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రమోహన్, టీఆర్‌ఎస్ మండలం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్‌లు యాకమూర్తి, వెంకన్న, మాజీ జడ్పీటీసీ సురేందర్, సర్పంచ్ బాలూనాయక్, ఎంపీటీసీలు రజిత, లక్ష్మినారాయణ, శ్రీరాములు, యాకయ్య, కొమురమల్లు, శ్రీనివాస్‌యాదవ్, వెంకన్న, శంకర్, పీఈటీ మధు, యూత్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్, హరిప్రసాద్, శ్రీను పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS