డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ తనిఖీలు


Thu,January 12, 2017 02:26 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 11: నిబంధనలు పాటించకుం డా మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఔషధ నియంత్రణాధికారి) సాం బయ్యనాయక్ దుకాణాల యజమానులను హెచ్చరించారు. బుధవారం ఆయ న జి ల్లా కేంద్రంలోని మెడికల్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఇంజక్షన్లు, టానిక్‌ల అమ్మకాలగూర్చి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు రాసే చీటీల ద్వారానే మందులు విక్రయించాలని సూచించారు. సేల్స్, పర్చేస్ వివరాలు రికార్డులు నిర్వహించాలని ఆ దేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే దుకాణాలు, క్లినిక్‌లను సీజ్ చేస్తామని డీఐ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తే వాటిపై పూర్తి స్థాయిలో విచారించి వారికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులకు తగ్గ వివరణ ఇవ్వ ని దుకాణాలను సీజ్ కూడా చేస్తామని డీఐ హెచ్చరించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS