ప్రజలతో మమేకమయ్యేందుకే గ్రామ పోలీస్


Thu,January 12, 2017 02:26 AM

నర్సింహులపేట, జనవరి 11: గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యేందుకే గ్రామ పోలీస్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ మురళీధర్ చెప్పారు. బుధవారం దంతాలపల్లి మండలంలోని గున్నెపల్లి గ్రామంలో గ్రామ పోలీస్ అధికారి విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పోలీస్ అధికారిగా కానిస్టేబుల్ అంజయ్యను నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లా డుతూ గ్రామాల్లో ప్రజలు ఎలాంటి గొడవలకు తావివ్వకుండా స్నేహ సంబంధాలు కొనసాగించాలని సూచించారు.

చిన్నచిన్న సమస్యలు ఉంటే గ్రామ పోలీస్‌కు వివరించి అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని కోరారు. వారంలో మూడు రోజులపాటు గ్రామ పోలీస్ గ్రామంలోనే ఉంటాడని వివరించారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో గ్రామ పోలీస్‌లను నియమిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణతోపాటు ఏమైన సంఘటనలు జరిగినప్పుడు సకాలంలో సమాచారం ఇవ్వడమే కాకుండా నిందితులను వెంటనే పట్టుకునేందుకు కావాల్సిన సమాచార వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ పంచాయతీకి గ్రామ పోలీస్ అధికారిగా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. సమావేశంలో తొర్రూరు డీఎస్పీ రాజారత్నం, జెడ్పీటీసీ ధర్మారపు వేణు, సీఐ కె.శ్రీధర్‌రావు, సర్పంచ్‌లు సాలమ్మ, పర్శయ్య, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నగేష్, ఎంపీటీసీ కిశోర్‌కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

275
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS