క్రీడలు స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగిస్తాయి

Thu,January 12, 2017 02:26 AM

కురవి, జనవరి 11: క్రీడలు మానసికోల్లాసంతోపాటు స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగిస్తాయని మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాలో దివంగత గోవింద రాథోడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాయిస్ ఆఫ్ ఫెడ్సిటీ ఛాంపియన్ క్రికెట్ పోటీలను డీఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి క్రీడలు నిర్వహించుకోవడం వల్ల ఇతర మండలాలు, జిల్లా కేంద్రం నుంచి క్రీడాకారులు రావడంతో వారి మధ్య పరిచయం స్నేహంగా మారి కలకాలం ఉంటుందన్నారు.

గెలుపోటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని సూచించారు. యువత ఆటలతోపాటు గ్రామాలు, తండాల అభివృద్ధిపై స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ ప్రతీ సంక్రాంతికి తండాలో ఆటలతోపాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ తండా అంతా సంతోషంగా గడుపుతోందన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించడంతోపాటు తండాను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ కిషన్‌నాయక్, శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ గార్లపాటి వెంకట్‌రెడ్డి, కురవి ఎస్సై అశోక్, కమిటీ సభ్యులు మల్సూర్, రవీందర్, దేవేందర్, రమేశ్, గణేశ్, బాలాజీ, లక్‌పతి, రఘు, సునీల్, సాయికుమార్, నవీన్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...