పరుగులో ఖాజామియా ఫస్ట్..!


Thu,January 12, 2017 02:25 AM

నర్సింహులపేట : తెలంగాణ రాష్ట్ర మూడో మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టీఆర్‌ఎస్ మాజీ మండలాధ్యక్షుడు ఎండీ.ఖాజామియా ప్రథమ స్థానంలో నిలిచి, స్వర్ణ పతకాన్ని సాధించాడు. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురంలో ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 55 ఏళ్ల విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 800 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. మార్చి 22న అలహాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS