వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం


Thu,January 12, 2017 02:25 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 11: ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్యం కోసం తప్పని సరిగా వ్యాయామం చేయాలని జాయింట్ కలెక్టర్ కట్కూరి దామోదర్‌రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక ఎస్‌వీఎం ఫంక్షన్ హాల్‌లో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉదయం పూట వాకింగ్ అలవర్చుకోవాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఇమ్మడి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్, వాకర్ డోలి లింగుబాబు, ప్రధాన కార్యదర్శి ఆకుల శంభయ్య, గౌరవ అధ్యక్షుడు భువనగిరి రవీంద్రగుప్త, పాలబిందెల మల్లయ్య, సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్, నల్లు సుధాకర్‌రెడ్డి, తప్పెట్ల వెంకన్న, తండ సదానందం, ఎస్.గోవర్ధన్, నక్క నాగార్జున, నెలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి, కన్న అశోక్, ఎస్.పరందామయ్య, వంగ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


పీఆర్టీయూ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
పీఆర్టీయూ తెలంగాణ టేబుల్ క్యాలెండర్‌ను జేసీ కట్కూరి దామోదర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోతు హల్యానాయక్, జాటోతు జేతురాంనాయక్, జిల్లా అధ్యక్షుడు పులి దేవేందర్, ప్రధాన కార్యదర్శి బోడ రాంజీనాయక్, సంఘం ప్రతినిధులు జి.నవీన్, కిరణ్‌కుమార్, కుమారస్వామి, ఆదిరెడ్డి, రమేశ్, పరంజ్యోతి పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS