కనుల పండవగా కుడారై మహోత్సవం

Thu,January 12, 2017 02:24 AM

గార్ల, జనవరి 11: శ్రీలక్ష్మీనారాయణ-గోదాదేవీలకు కుడారై మహోత్సవ వేడుకలను మండలకేంద్రంలోని ఆలయంలో ఆలయ అర్చకుడు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు ఆధ్వర్యంలో కనులపండువగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో గత నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి తొలుత అభిషేకం చేసి, నూతన పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి, స్వామివారి సేవలో తరించిపోయారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...