గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి


Thu,January 12, 2017 02:24 AM

మహబూబాబాద్ రూరల్, జనవరి 11: మానుకోటలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజావత్ రామచంద్రునాయక్‌కు సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దరావత్ మోతీలాల్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు దరావత్ వెంకన్ననాయక్, గుగులోతు రవినాయక్, బానోత్ సుభాశ్‌నాయక్, గుగులోతు నందూలాల్‌నాయక్, బోడ సుమన్‌నాయక్ మాట్లాడారు. తమ ప్రాంతవాసుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రామచంద్రునాయక్‌ను కోరారు.


సోమ్లాతండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి
మండలంలోని పర్వతగిరి శివారు సోమ్లాతండాలో ఎస్టీ (లంబాడ) కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ తేజావత్ రామచంద్రునాయక్‌కు టీడీపీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూక్య సునీతా మంగీలాల్, కొండపల్లి కేశవరావు, బాలునాయక్, ఉప్పల మహేశ్, రామునాయక్ పాల్గొన్నారు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS