ఆపదలో ఉన్న వారికి సర్కారు అండ : ఎమ్మెల్యే


Thu,January 12, 2017 02:23 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 11: ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కేసముద్రం మండలం మహమూదపట్నం గ్రామానికి చెందిన వి.రాజు, ఉప్పరపల్లికి చెందిన జె.స్వామి, మానుకోటకు చెందిన వి.అజయ్‌కుమార్, నడివాడకు చెందిన బి.నవీన్, అమనగల్‌కు చెందిన బి.మంగ్యా, గూడూరు మండలం అయోధ్యపురంకు చెందిన ఆర్.అనూషకు రూ. 4.02 లక్షల చెక్కులు అందుకున్నారు. కార్యక్రమంలో మార్నేని వెంకన్న, గడ్డం అశోక్, తూము వెంకన్న, పెద్ది వెంకన్న, సైదులు, ఇబ్రహీం, సుదగాని మురళీగౌడ్, వెన్నమల్ల అజయ్, భూక్య ప్రవీణ్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS