కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి

Thu,January 12, 2017 02:23 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 11: కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో టీఎస్ గౌట్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరకధిక సమ్మె బుధవారం 14వ రోజుకు చేరింది. ఈ శిబిరాన్ని సత్యనారాయణ సందర్శించి మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారన్నారు. సమ్మెలో రవికిరణ్, రవీందర్, రియాజ్, రాజు, రమేశ్, సతీశ్, విజయ్, మహేందర్, తులసీదాస్, అనిత, సునీత, అండాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...