ఉన్నత శిఖరాలను అధిరోహించాలి


Wed,January 11, 2017 02:47 AM

గార్ల, జనవరి10: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. బంజారా సేవ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల, అశ్రమంలోని డైనింగ్ హాల్, మూత్ర శాలలు, మరుగుదొడ్లను, ప్రాంగణంలోని క్రీడా మైదానంతో పాటు స్టోర్ రూంలను పరిశీలించారు. అనంతరం సమావేశ మందిరంలో విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పాఠాలు చదివించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువు కీలకం అన్నారు. విద్యార్థులు బాల్యం నుంచే శ్రద్ధతో చదవాలని, అప్పుడే జీవితంలో అనుకున్నది సాధించవచ్చని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని అన్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ పీతిమీనా మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మండలస్థాయి అధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని, తమ వృత్తికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షాంక్షిస్తున్న బంగారు తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పీతిమీనా వెంట జడ్పీటీసీ ఎద్దు మాధవి, ఎంపీపీ కోనేటి సుశీల, తహసీల్దార్ రమేశ్, ఈవోపీఆర్డీ బాలరాజు, బీఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు జోగిరాం తేజావత్, సిబ్బంది ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS