కలెక్టర్ చొరవతో ఎస్పీ ఆఫీసుకు తాగునీరు

Wed,January 11, 2017 02:47 AM

మహబూబాబాద్ క్రైం: కలెక్టర్ ప్రీతిమీనా చొరవతో జిల్లా పోలీసు కార్యాలయానికి మంచినీటి వసతి ఏర్పాటు చేశారని జిల్లా ఎస్పీ జే.మురళీధర్ అన్నారు. కొంత కాలంగా మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని, ఆమె వెంటనే స్పందించి మున్నేరు వాగునుంచి వెళ్లే పైపులైన్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రత్యేక పైపులైన్ వేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

దీంతో మంగళవారం ఉదయం పైపులైను మళ్లింపు వద్ద ఎస్పీ మురళీధర్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బి.ఉమతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్న, మున్సిపల్ ఏఈ, డీఈలు, ఏఆర్ డీఎస్పీ రాంచందర్, అడ్మిన్ ఆర్‌ఐ సదానందం, ఆర్‌ఐ వెల్ఫేర్ నర్సయ్య, ఎస్పీ పీఆర్‌వో కుశాల్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...