మందులు విక్రయిస్తే బిల్లు ఇవ్వాల్సిందే


Wed,January 11, 2017 02:47 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ : మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తే విధిగా బిల్లులు ఇవ్వాల్సిందేనని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి సాంబయ్య నాయక్ చెప్పారు. మెడికిల్ షాపులు అనే శీర్షికన నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై స్పందింస్తూ మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పలు మెడికల్ షాపుల్లో ఆయన తనిఖీలు చేశారు. షెడ్యూల్ హెచ్ పరిధిలోని డ్రగ్స్‌ను తప్పని సరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని లేని పక్షంలో మెడికల్ షాపుల వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

షాపులో విధిగా డ్రగ్స్‌కు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను నిర్వహించాలని, ఏ మం దులు ఏ రోగికి ఎంత మోతాదులో ఇచ్చారో వివరాలను రిజిస్టర్లలో పొందుపర్చాలని చెప్పారు. కంప్యూటర్ బిల్లులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా తప్పని సరిగా ప్రతి బిల్లుకు సంబంధించిన కార్బన్ ప్రతిని షాపులో ఫైల్ చేయాలని చెప్పారు. డ్రగ్ చట్టంలోని 123 నిబంధన ప్రకారం ఎవరైన వైద్యులు మందులకు సంబంధించిన షాంపిల్స్ కలిగి ఉన్నా నేరం అవుతుందని అన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS