తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్‌పై అవిశ్వాసం


Wed,January 11, 2017 02:46 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి10 : తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై మంగళవారం 9మంది డైరెక్టర్లు తిరుగుబాటు మొదలెట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీవో కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరి 2013లో బొమ్మకల్లుకు చెందిన నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ఆ పార్టీకి చెందిన డైరెక్టర్లు, కొంత మంది టీఆర్‌ఎస్ సానుభూతి పరులైన డైరెక్టర్ల సహకారంతో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మారిన పరిణామాల నేపథ్యంలో నిరంజన్‌రెడ్డిపై 9మంది డైరెక్టర్లు అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ తీర్మాన పత్రాన్ని అధికారులకు అందజేశారు.

పీఏసీఎస్ వైస్ చైర్మన్ నకిరకంటి కొమురయ్య, డైరెక్టర్లు కుమారస్వామి, కొండపల్లి భారతిదేవి, నాయిని గౌతంరెడ్డి, కేతిరెడ్డి పాపయ్య, తాటికాయల ఉప్పలమ్మ, కడారి జయసింహారెడ్డి, మేరుగు ప్రకాశ్‌గౌడ్, తలారి అబ్బయ్య అవిశ్వాస తీర్మానంలో సంతకాలు చేసి డీసీవో కార్యాలయ సిబ్బందికి ఈ ప్రతులను అందజేశారు. పీఏసీఎస్‌లో 13మంది డైరెక్టర్లు ఉండగా 9మంది చైర్మన్‌పై ఆవిశ్వాసాన్ని ప్రకటించారు. ప్రస్తుత చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాకుండా ముగిలిన ముగ్గురు డైరెక్టర్లలో కొందరు అవిశ్వాసం పెట్టిన డైరెక్టర్ల బృందానికి మద్దతు పలికేలా యోచిస్తున్నట్లు సమాచారం.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS