వాసవి, వనిత క్లబ్ సేవలను మరింత విస్తృత పరచాలి


Wed,January 11, 2017 02:46 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జనవరి10 : దేశ వ్యాప్తంగా వాసవి, వనిత క్లబ్ సేవలను మరింత విస్తృత పరచాలని ఆ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నూలి వెంకటరమణమూర్తి ఆ క్లబ్‌ల బాధ్యులు, సభ్యులకు సూచించారు. మంగళవారం స్థానిక భార్గవ్‌ఫంక్షన్‌హాల్లో మరిపెడ వాసవి, వనిత క్లబ్ 2017 నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి వెంకటరమణమూర్తి హాజరయ్యారు. కొత్త కార్యవర్గంతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా వాసవి, వనిత క్లబ్‌ల బాధ్యులుగా వంగపెల్లి భరత్‌కుమార్, గర్రపెల్లి జానకిరాములు, తల్లాడ చంద్రమోహన్, గర్రెపల్లి శిల్ప, ఇరుకుళ్ల లక్ష్మి, వుల్లి విద్య, ఇతర కార్యవర్గం ప్రమాణస్వీకారం చేయగా వారిని జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు గుడిపూడి నవీన్, ఎంపీపీ తాళ్లపెల్లి రాణి, నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, సర్పంచ్ రాంలాల్ అభినంధించారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు గార్లపాటి శ్రీనివాస్, పొట్టి శ్రీనివాస్, మల్లాల వీరమల్లయ్య, బోనగిరి సురేశ్, వేమిశెట్టి ఏకాంబ్రం, వుప్పల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS