ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Wed,January 11, 2017 02:46 AM

నెల్లికుదురు, జనవరి10 : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరాకిగానూ 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రవేశంకోరే విద్యార్థులు మొదటగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ఫారంనకు కుల, ఆదాయ, నివాస, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను జతచేసి రెండు పాస్‌ఫొటోలను జతచేసి ఈనెల 31 వరకు పాఠశాలలో అందివ్వాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వచ్చే నెల 20 నుంచి 26వరకు హాల్‌టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. అర్హులైన విద్యార్థలకు ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి 17 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...