సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి

Wed,January 11, 2017 02:45 AM

కురవి, జనవరి 10: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చాలని ఎంపీపీ బజ్జూరి ఉమ కోరారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బజ్జూరి ఉమ, మండల ప్రత్యేకాధికారి పురందర్ మాట్లాడుతూ మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పథకాలను ప్రజల దరి చేర్చడమేకాకుండా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో అర్హులను గుర్తించి అందించాలన్నారు. ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా వెనుకంజలో ఉందన్నారు. మండలంలోని తిరుమలాపురం, కొత్తూరు(జీ), కొత్తూరు(సీ) గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలన్నారు. నిర్మించుకోని వారికి అధికారులు వెళ్లి మరుగుదొడ్ల వల్ల కలిగే లాభాలు వివరించాలన్నారు.

అలాగే, ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్లు అందించేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఒంటరి మహిళలను గుర్తించి, సంబంధిత పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలన్నారు. మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ఆయా గ్రామాల్లో పథకాల అమల్లో ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ జన్ను సంజీవ, ఎంపీడీవో కృష్ణవేణి, వ్యవసాయాధికారి మంజూఖాన్, ఈజీఎస్ ఏపీవో యాకాంబ్రం, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...