ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది


Wed,January 11, 2017 02:45 AM

గూడూరు: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం చంద్రుగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూనావత్ బాలూ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సమాజానికి మార్గ దర్శకుడని, ఉపాధ్యాయుడి త్యాగాలతోనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతారని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టాక ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి లకా్ష్మరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఖాసీం, ఎంపీపీ చెల్పూరి వెంకన్న, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చీకటి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి బద్రినారాయణ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు యాకూబ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ఎంఈవో భిక్షపతితో పాటు ఉపాధ్యాయులు పలువురు నాయకులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS