దివ్యాంగుల సంక్షేమానికి కృషి

Thu,December 5, 2019 11:53 PM

వాంకిడి: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని ఇంద్రానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ది వ్యాంగుల దినోత్సవంలో గురువారం పా ల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వికలాంగ వి ద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి విద్యాబుద్దులు నేర్చుకోవాలని సూచించా రు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఎమ్మెల్యే ఆత్రం స క్కు, ఎంపీపీ ముండే విమలాబాయి, స్థాని క నాయకులతో కలసి బహుమతులిచ్చారు. మండల ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, వాం కిడి సర్పంచ్‌ బండే తుకారాం, ప్రధానోపాధ్యాయురాలు సునంధ, ఉపాధ్యాయులు చైతన్య, ఉప్రే పకాశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ముండే దీపక్‌, తదితరులున్నారు. మండల పరిషత్‌ కార్యాలయానికి మొదటి సారిగా వచ్చిన జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎ మ్మెల్యే ఆత్రం సక్కుకు ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, మండలంలోని కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు వేర్వేరుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles