మున్సి‘పోల్స్‌'కు వేగంగా కసరత్తు

Thu,December 5, 2019 03:54 AM

-హైకోర్టు ఆదేశాలతో వార్డులపునర్విభజనకు నోటిఫికేషన్‌
-ఓటర్ల జాబితా పున:పరిశీలనలో అధికారులు నిమగ్నం
-9వ తేదీలోగా అభిప్రాయాల సేకరణ
-16లోగా అభ్యంతరాలు పరిశీలన
-17న తుది జాబితా
-రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగం గా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాను మరోసారి పరిశీలించి.. సరి చేయాలని హైకోర్టు ఆదేశించడం తో అధికారులు తాజా నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. కాగజ్‌నగర్‌ బల్దియాలో గతంలో 28 వార్డులు ఉండగా, వాటి సంఖ్య 30 పెంచారు. ప్రస్తుతం వార్డుల సరిహద్దులను సరిచూసుకుంటున్నారు. గతంలో చేసిన వార్డుల విభజన సరిగా జరగలేదంటూ సందేహాలను వ్యక్తం చేసిన ఆశావాహు లు.. ఈసారైనా తమకు అనుకూలంగా ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాము ఉం టున్న ప్రాంతాల్లో వచ్చే రిజర్వేషన్లను బట్టి పోటీ చేయాలని భావిస్తున్నారు.

జనాభా ఆధారంగా..
కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని జనాభా ఆధారంగా డ్రాఫ్ట్‌ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. గతంలో 28 వార్డులు ఉండగా, ఇటీవల 30 వార్డులు చేశారు. ఇటీవల తయారు చేసి నివేదికల ప్రకారం కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 44,280 మంది ఓటర్లు ఉండగా.. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన జ నాభా ప్రకారం.. వార్డుల సంఖ్య కూడా పెరిగేలా ఉంది. ప్రస్తుతమున్న జనాభా ఆధారంగా కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ నెల 17న తుది జాబితా
హైకోర్టు ఆదేశాల మేరకు తాజా నోటిఫికేషన్‌పై ఈ నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలను 16న పరిశీలించి.. 17న తుది జాబితా విడుదల చేస్తారు. వార్డుల విభజనపై ఆశావాహుల నుం చి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన వార్డుల విభజన సరిగా లేనందుకు కొంత మంది ఆశావాహులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మరోసారి జరిగే వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles