ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి

Thu,December 5, 2019 03:53 AM

-ఇంటింటా ఇంకుడు గుంత తవ్వుకోవాలి
-డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు వేగంగా పూర్తవ్వాలి
-జిల్లా పరిషత్‌ సీఈవో వేణు
-స్వచ్ఛగ్రామం చిన్నరాస్పల్లి సందర్శన

దహెగాం : ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్పీ సీఈవో వేణు అన్నారు. మండలంలోని స్వచ్ఛగ్రామం చిన్నరాస్పల్లిని బుధవారం ఆయన సందర్శించారు. అంతర్గత రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా జడ్పీ పాఠశాలను సందర్శించారు. అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ కంభగౌని సులోచన, సర్పంచ్‌ తుమ్మిడ అమృత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రా మంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో గతేడాది చిన్నరాస్పల్లిని స్వచ్ఛగ్రామంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. కాగజ్‌నగర్‌ మండలం బోడెపల్లి, పెంచికల్‌పేట మండలం బొంబాయిగూడ, దహెగాం మండలం చిన్నరాస్పల్లి ని స్వచ్ఛగ్రామాలుగా ఎంపిక చేసినట్లు చె ప్పారు. అదేవిధంగా ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించారు.

30 రోజుల ప్రణాళికలో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. డంపిగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమున్న సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనీ, అదేవిధంగా మెనూప్రకారం మధ్యాహ్నభోజనాన్ని అందించాలని హెచ్‌ఎం లతీఫ్‌కు సూచించారు. డీపీవో రమేశ్‌, ఏపీడీ వెంకట్‌, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్‌, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్‌, ఏ పీవో చంద్ర య్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles